కోడి పందాల స్థావరంపై దాడి.. ముగ్గురు అరెస్ట్
E.G: నల్లగొండ గ్రామ శివారులో ఎస్సై డి.రామ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. కోడిపందాలు ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 5 పందెం కోళ్లు, 2 కత్తులు, రూ. 5,160 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఎవరైనా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.