నది కోతకు గురవుతున్న పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే
కోనసీమ: ఆత్రేయపురం మండలం రాజవరంలో గోదావరి నదీ కోతకు గురవుతున్న లంక పొలాలను శుక్రవారం ఎమ్మెల్యే బండారు పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్య పూర్వాపరాలను తెలుసుకున్నారు. గతంలో ఇక్కడ మట్టి తవ్వకాలు జరగడం వల్ల నేల వదులై పొలాలన్నీ కోతకు గురవుతున్నాయని రైతులు ఆయన వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయల విలువచేసే భూములు గోదావరిలో కలిసిపోతున్నాయన్నారు.