రాజోలిలో 10 మంది జూదరుల అరెస్ట్

GDWL: రాజోలి మండలం మార్దొడ్డి గ్రామంలో బోయ రమేష్ గుడిసెలో జూదం ఆడుతున్నారన్న సమాచారం మేరకు గురువారం పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న 10 మందిపై కేసు నమోదు చేసినట్లు రాజోలి ఎస్సై గోకారి తెలిపారు. అలాగే వీరి వద్ద నుంచి రూ. 11,320 నగదును స్వాధీనం చేసుకున్నామని ఆయన వివరించారు.