గ్లోబల్ సమ్మిట్‌కు తెలంగాణ రుచి!
HYD: రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు వచ్చే అతిథులకు ప్రత్యేకంగా తయారు చేస్తున్న వంటకాల్లో తెలంగాణ చిరుతిళ్లకు ముఖ్య స్థానం దక్కింది. వారికి చిరుతిళ్లతో కూడిన స్పెషల్ డైట్ కిట్ ఇవ్వబోతున్నారు. ఇందులో సకినాలు, గారెలు, ఇప్పపువ్వు లడ్డూ, మక్కపేలాలు వంటివి ఉండనున్నాయి. భోజనంలో HYD బిర్యానీ, మటన్ కర్రీతో పాటు విదేశీ ప్రతినిధుల కోసం వారి దేశాలకు చెందిన వంటకాలను కూడా తయారు చేస్తున్నారు.