డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించిన పోలీసులు

HNK: మద్యం సేవించి వాహనాలు నడపటం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకై పోలీసులు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా శుక్రవారం రాత్రి హసన్‌పర్తి ఎస్సై దేవేందర్ ఆధ్వర్యంలో జయగిరి క్రాస్ రోడ్డు వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనం నడపటం నేరమని ఎస్సై వాహనదారులను హెచ్చరించారు.