'బైరాగులు వచ్చారు.. చల్లంగా చూడమ్మ’

'బైరాగులు వచ్చారు.. చల్లంగా చూడమ్మ’

TPT: తిరుపతి గంగమ్మ జాతరలో భాగంగా బుధవారం బైరాగి వేషంలో భక్తులు సందడి చేస్తున్నారు. శరీరమంతా వీభూది పూసుకుని నల్లబొట్లు పెట్టుకుని చేతిలో వేపాకు, పరక పుల్లలతో నృత్యాలు చేస్తూ బూతులు తిడుతూ ఆలయానికి చేరుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఆలయ చుట్టూ ప్రదక్షిణలు చేసి గంగమ్మ పాదాల వద్ద కర్పూరం వెలిగించి పూజలు చేశారు.