'మేడే స్ఫూర్తితో పోరాటాలు చేద్దాం'

'మేడే స్ఫూర్తితో పోరాటాలు చేద్దాం'

SRD: మేడే స్ఫూర్తితో హక్కుల సాధనకు ఉద్యమిద్దామని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ అన్నారు. మేడే సందర్భంగా సంగారెడ్డిలోని కేకే భవన్‌లో గురువారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పోరాటం చేయడం ద్వారానే హక్కులు సాధించుకోవచ్చని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నర్సింలు, కార్యవర్గ సభ్యులు రేవంత్, కృష్ణ పాల్గొన్నారు.