జూబ్లీహిల్స్‌లో యమధర్మరాజు..!

జూబ్లీహిల్స్‌లో యమధర్మరాజు..!

HYD: కేబీఆర్ పార్క్ కూడలి వద్ద జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు వినూత్నంగా అవగాహన కల్పించారు. యమధర్మరాజు వేషధారణలో ఉన్న వ్యక్తితో ప్రయాణికులకు ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యాన్ని వివరించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, స్టాప్ లైన్ దాటడం వంటి పొరపాట్లు ప్రాణాల మీదకు తెస్తాయని, నియమాలు ఉల్లంఘిస్తే యమపురి దారి చూపిస్తానని హితవు పలికారు.