సంతకవిటిలో దట్టంగా కమ్మేసిన పొగ మంచు

సంతకవిటిలో దట్టంగా కమ్మేసిన పొగ మంచు

VZM: సంతకవిటిలో అర్ధరాత్రి దాటిన తరువాత నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు పొగమంచు కమ్మేస్తోంది. పొగమంచు పూర్తి స్థాయిలో కమ్మేయడంతో సాధారణ జన జీవనానికి తీవ్ర ఇబ్బందిగా మారిందని పలువురు అంటున్నారు. వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడుతోంది. పంట పొలాలపై పొగ మంచు కమ్మేయడంతో జీడి, మామిడి, పెసర, మినప రకాల పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.