అమరావతిలో మహిళా దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష
GNTR: అమరావతిలో ఈ నెల 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల నిర్వహణపై మంత్రి సవిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సహచర మంత్రి గుమ్మడి సంధ్యారాణి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతారని తెలిపారు.