నంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్

నంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్

NLG: జిల్లాలో నెంబర్ ప్లేట్ లేని వాహనాల ద్వారా దొంగతనాలకు పాల్పడుతున్నందున జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఉత్తర్వుల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మొత్తం 60 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని, నంబర్ ప్లేట్ అమర్చిన అనంతరం వారి స్వంత పూచీకత్తుపై విడుదల చేసినట్లు నకిరేకల్ ఎస్సై పి. రాజశేఖర్ తెలిపారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.