మోటుమర్ల KGBV పాఠశాలలో పీటీఎం కార్యక్రమం
సత్యసాయి: ధర్మవరం రూరల్ మండలం మోటుమర్ల గ్రామంలోని KGBV గర్ల్స్ పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్–టీచర్స్ మీటింగ్‌లో హరీష్ బాబు గారు పాల్గొన్నారు. మంత్రి సత్య కుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు విద్యార్థుల చదువు, వసతులు, భద్రతపై తల్లిదండ్రులు–ఉపాధ్యాయులతో సమావేశమై సూచనలు అందించారు. బాలికల విద్యకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు.