VIDEO: డిసెంబర్ 14 నుంచి డీఆర్ఎం కప్
VSP: ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్, విశాఖ వాల్తేరు ఆధ్వర్యంలో డీఆర్ఎం కప్ అఖిల భారత ఇన్విటేషన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ టోర్నమెంట్ డిసెంబర్ 14వ తేదీ నుంచి డిసెంబర్ 21వ తేదీ వరకు విశాఖలోని వాల్తేరు రైల్వే స్టేడియంలో జరగనుందని డీఆర్ఎం లలిత్ బోహ్రా తెలిపారు. ఈ మేరకు డీఆర్ఎం పోస్టర్‌ను ఆవిష్కరించారు.