'రేపు చలో కమిషనరేట్ జయప్రదం చేయాలి'

'రేపు చలో కమిషనరేట్ జయప్రదం చేయాలి'

SRD:ఎన్ హెచ్ఎం ఉద్యోగుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ.. ఈ నెల 29వ తేదీన వైద్యశాఖ కమిషనర్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి శుక్రవారం కోరారు. మూడు నెలల నుంచి వేతనాలు రాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ముట్టడికి ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.