VIDEO: ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించిన కలెక్టర్
కృష్ణా: మర్రివాడ గ్రామంలో రోడ్డు పక్కన ఆరబెట్టిన ధాన్యాన్ని కలెక్టర్ బాలాజీ బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులెవరు ఆందోళన చెందవద్దని, ప్రతి ఒక్క ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. వర్షాల నేపథ్యంలో నూర్పులను వాయిదా వేసుకోవాలని సూచించారు. ఎటువంటి ఇబ్బందులు కలిగిన తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ తెలిపారు.