లక్కీ డ్రా ద్వారా దుకాణాల కేటాయింపు!
WNP: వనపర్తి పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించిన సమీకృత మార్కెట్ దుకాణాలను లక్కీ డ్రా ద్వారా కేటాయించారు. జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ సమక్షంలో 32 దుకాణాలు, ఒక సూపర్ మార్కెట్, ఒక బ్యాంక్వెట్ హాల్ను లాటరీ విధానంలో పారదర్శకంగా పంపిణీ చేశారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రక్రియ ద్వారా అర్హులకు షాపులను అప్పగించినట్లు పేర్కొన్నారు.