అల్లీపూర్‌లో ఉపాధి హామీ పనులకు ప్రజలు దూరం

అల్లీపూర్‌లో ఉపాధి హామీ పనులకు ప్రజలు దూరం

MDK: శివ్వంపేట మండలం అల్లీపూర్‌లో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పథకం పనులకు గ్రామ ప్రజలు ఎక్కువగా హాజరు కావడం లేదని తెలుస్తోంది. అయితే అల్లీపూర్ తండాకు చెందిన కొందరు కూలీలు మాత్రం పనులకు హాజరై పనులు కొనసాగిస్తున్నారు. గ్రామంలోని మరికొంత మంది ప్రజలు పనులకు హాజరై ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.