పాఠశాలలో జిల్లా ప్యానల్ బృందం తనిఖీ

పాఠశాలలో జిల్లా ప్యానల్ బృందం తనిఖీ

SRPT: ​నడిగూడెం లోని స్థానిక కాలనీ ప్రాథమిక పాఠశాలను మంగళవారం జిల్లా ప్యానల్ తనిఖీ బృందం సందర్శించింది. ప్రార్థనా సమయానికే పాఠశాలకు చేరుకున్న బృందం సభ్యులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల హాజరును పరిశీలించారు. అనంతరం పాఠశాలలో కొనసాగుతున్న అభ్యాసనాభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించి, విద్యా ప్రమాణాల మెరుగుదలకు పలు సూచనలు చేశారు.