రైతు బజార్ తాత్కాలికంగా తరలింపు

VZM: విజయనగరం పట్టణం ఎం.ఆర్.హెచ్ రైతు బజార్‌ను తాత్కాలికంగా రింగ్ రోడ్డులో ఖాళీగా ఉన్న ప్రాంగణంలోకి మారుస్తున్నట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. రైతు బజార్‌కు అవసరమైన షెడ్లు అక్కడ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతుల సౌకర్యార్థం ఈ చర్యలు తీసుకొన్నట్లు పేర్కొన్నారు. రైతులు, వినియోగదారులు గమనించాలని కోరారు.