ఉపాధి హామీతో సాగునీటి పనులకు ప్రాధాన్యత

మన్యం: జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులకు బహుళ ప్రయోజనాలైన పనులకు ప్రాధాన్యతనిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. గరుగుబిల్లి మండలం కొంకిడివరంలో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా చెరువు ఫీడర్ నిర్మాణ పనులకు శుక్రవారం కలెక్టర్ శంకుస్థాపన చేశారు. ఉపాధి హామీ పథకం కూలీలతో ముఖాముఖి నిర్వహించారు.