VIDEO: బస్టాండ్‌లో విద్యుత్ తీగల నుంచి మంటలు

VIDEO: బస్టాండ్‌లో విద్యుత్ తీగల నుంచి మంటలు

ELR: ముదినేపల్లి బస్టాండ్‌లోని మీటరు వద్ద ఉన్న విద్యుత్ తీగల నుంచి ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. తీగలకు తరచూ అతుకులు వేయడం వల్లనే ప్రమాదం జరుగుతున్నట్లు తెలుస్తోంది. పొగ, కాలిన వాసన రావడంతో అప్రమత్తమైన కంట్రోలర్ వెంటనే వెళ్లి మంటలను ఆర్పడంతో పెనుప్రమాదం త్రుటిలో తప్పింది.