ATM చోరీ ఘటనను పరిశీలించిన CP

NZB: ఇటీవల టౌన్ 3 పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీలో SBI బ్యాంక్ ATMలో గుర్తు తెలియని దుండగులు గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంలో ప్రవేశించి దొంగతనానికి ప్రయత్నం చేసి పరారైన సంగతి తెలిసిందే. ఘటనా స్థలంలో ఏటీఎం సెంటర్‌ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం పరిశీలించారు. ఎస్సై హరిబాబు, సీఐ శ్రీనివాస్ రాజుకు సూచనలు చేశారు.