రెండు రామాలయాల్లో చోరీ

NLR: కలువాయి మండలం పెన్న బద్వేల్‌లో అంగన్‌వాడీ కేంద్రం, రెండు రామాలయాల్లో చోరీ జరిగింది. అంగన్‌వాడీ కేంద్రం నుంచి దొంగలు బియ్యం, పప్పు, గుడ్లు, నూనె ప్యాకెట్లు అపహరించారు. రామాలయాల్లో సీతమ్మ విగ్రహానికి అలంకరించిన బంగారు తాళిబొట్టు, కాసులు దొంగిలించారు. సమాచారం అందుకున్న ఎస్సై కోటయ్య ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.