'నీటి మునిగిన ఇళ్ళు'

'నీటి మునిగిన ఇళ్ళు'

W.G: కొవ్వూరులో బుధవారం తెల్లవారుజామున నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంలో పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి. కొవ్వూరు మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 8, 9వ వార్డులో మురుగు కాల్వలు నిండిపోయి వర్షం నీరు ఏరులై వీధుల్లో పారింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కొవ్వూరు అగ్నిమాపక కేంద్రం వర్షపునీటిలో మునిగిపోయింది.