ఓగిరాలలో టవర్ వివాదం

ఓగిరాలలో టవర్ వివాదం

కృష్ణా: బాపులపాడు మండలం ఓగిరాల గ్రామంలో శనివారం సెల్‌ఫోన్ టవర్ నిర్మాణాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. పంచాయతీ తీర్మానం లేకుండా నిర్వాహకులు టవర్ నిర్మాణ పనులు చేపడుతున్నారని గ్రామ ప్రజలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు, టవర్ నిర్వాహకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ముందస్తు అనుమతులు లేకుండా పనులు చేపట్టడం వల్ల గ్రామానికి ఇబ్బందుల అని అన్నారు.