'ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పారదర్శకంగా సాగుతోంది'

NGKL: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పారదర్శకంగా సాగుతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చుక్కాయిపల్లిలో గురువారం జరిగిన ఓ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.