రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో దొడ్డి రాకేష్ అనే వ్యక్తి బల్లర్ష వైపు వెళ్లే గుర్తు తెలియని రైలుకి పడి శుక్రవారం ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ సురేష్ గౌడ్ తెలిపారు. ఆసిఫాబాద్‌కు చెందిన రాకేష్ మద్యానికి బానిసై, ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.