గూడెం గ్రామానికి విద్యుత్ సౌకర్యం
అల్లూరి: అనంతగిరి మండలం గూడెం గ్రామానికి సంబంధిత అధికారులు విద్యుత్ సౌకర్యం కల్పించారు. తమ గ్రామానికి విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని గత నెల 11న గ్రామస్తులు ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు అప్పుడు గ్రామాన్ని సందర్శించారు. 25 రోజుల్లోనే సోలార్ ప్లాంట్ ఏర్పాటుచేసి, విద్యుత్ సౌకర్యం కల్పించారు. దీంతో బుధవారం గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.