పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి శ్రీనివాస్

పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి శ్రీనివాస్

VZM: గజపతినగరంలోని పైడితల్లి అమ్మవారిని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త కందుల చిన్నయ్య స్వామి మంత్రి శ్రీనివాస్‌కు స్వాగతం పలికారు. ఆలయం తృతీయ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. మాజీ మంత్రి పడాల అరుణ, ఏఎంసీ ఛైర్మన్ గోపాలరాజు, టిడిపి నేతలు గంట్యాడ శ్రీదేవి జానకిరామ్ పాల్గొన్నారు.