జనసేనలో చేరిన 50 కుటుంబాలు

VZM: జనసేన నాయకులు అవనాపు త్రివిక్రమ్, భావన దంపతుల సమక్షంలో గురువారం జయనగరంలో 50వ డివిజన్ వైసీపీకి చెందిన పలు కుటుంబాలు జనసేనలో చేరాయి. ఈ సందర్భంగా త్రివిక్రమ్, దంపతులు వారికి పార్టీ కార్యాలయంలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు జన సైనికులంతా ఒక కుటుంబంగా ముందుకు సాగుదామని విక్రమ్ పిలుపునిచ్చారు.