'ప్రమాదాల నివారణకు కాటమయ్య రక్షక కిట్టు దోహదం'

NLG: నకిరేకల్ పట్టణంలోని గౌడ కార్మికులు కాటమయ్య రక్షక కవచం కిట్లను ఎమ్మెల్యే వేముల వీరేశం శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రమాదాల నివారణకు కాటమయ్య రక్షక కిట్టు ఎంతగానో దోహదపడుతుందన్నారు. నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో 500 గౌడ సోదరులకు కాటమయ్య రక్షక కిట్లను పంపిణీ చేశామని అన్నారు.