తిరుపతిలో NTR స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభం
AP: యువగళం హామీ మేరకు తిరుపతిని స్పోర్ట్స్ హబ్‌గా మారుస్తామని మంత్రి లోకేష్ అన్నారు. గొల్లవానిగుంటలో రూ.10.10 కోట్లతో నిర్మించిన NTR స్పోర్ట్స్ కాంప్లెక్స్, క్రికెట్ పెవిలియన్‌ను ఆయన ప్రారంభించారు. మిథాలీ రాజ్, PV సింధు వంటి దిగ్గజ క్రీడాకారులతో కలిసి ఆయన సందడి చేశారు. అలాగే రూ.5.35 కోట్లతో కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్ అకాడమీకి శంకుస్థాపన చేశారు.