14 నుంచి మాతా వైష్ణోదేవి యాత్ర పునఃప్రారంభం!

14 నుంచి మాతా వైష్ణోదేవి యాత్ర పునఃప్రారంభం!

జమ్మూకశ్మీర్‌ రియాసి జిల్లాలోని శ్రీ మాతా వైష్ణోదేవి యాత్ర నిలిచిపోయిన విషయం తెలిసిందే. కాగా, ఈ యాత్ర ఈ నెల 14 నుంచి పునఃప్రారంభం కానున్నట్లు వైష్ణోదేవి పుణ్యక్షేత్ర బోర్డు తెలిపింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన యాత్ర.. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈ నెల 14 నుంచి పునఃప్రారంభమవుతుందని బోర్డు పేర్కొంది.