ఎన్నికల హామీని విస్మరించిన కాంగ్రెస్

ఎన్నికల హామీని విస్మరించిన కాంగ్రెస్

MNCL: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 46 రద్దు చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మంచిర్యాలలో తెలంగాణ తల్లి విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ విస్మరించిందన్నారు.