వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఎండకాలంలో వడదెబ్బ తగలకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దాహం వేయకపోయినా రోజంతా తగినంత నీరు తాగుతూ ఉండాలి. వదులుగా ఉండే కాటన్ బట్టలు ధరించడం మంచిది. పండ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. బయటకు వెళ్తే గొడుగు, టోపీ, సన్ గ్లాసెస్ తప్పక వాడాలి.