'వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి'
BHNG: వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాజాపేటలోని విద్యుత్ సబ్ స్టేషన్ ముందు బీజేపీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లో వోల్టేజీతో నాణ్యమైన విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై నినాదాలు చేశారు.