కొండేరు గ్రామంలో ఏకగ్రీవ ఉత్సవం
జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం, కొండేరు గ్రామం నందు 10వ వార్డు మెంబర్ శ్యామల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ హరిత సోమనాద్రి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొని ఏకగ్రీవ ఉత్సవాన్ని నిర్వహించారు.