విద్యుత్ సమస్యలా..? నేడే వాటిని పరిష్కరించుకోండి

విద్యుత్ సమస్యలా..? నేడే వాటిని పరిష్కరించుకోండి

NLR: బుధవారం సాయంత్రం 3:30 గంటల నుంచి 5:30 వరకు పొదలకూరు డిస్కం సబ్ డివిజన్ పరిధిలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఏడీఈ సుబ్రహ్మణ్యం తెలిపారు. పొదలకూరు, మనుబోలు, రాపూరు, సైదాపురం, ముత్తుకూరు, తోటపల్లిగూడూరు, వెంకటాచలం, నెల్లూరు గ్రామీణ మండలాలకు చెందిన ప్రజలు విద్యుత్‌కు సంబంధించిన సమస్యలను అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలన్నరు.