చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి: మల్లికార్జున

చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి: మల్లికార్జున

KDP: మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన చేనేత కార్మికులను ఆదుకోవాలని జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అవ్వారు మల్లికార్జున డిమాండ్ చేశారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన చేనేత కుటుంబాలు మగ్గం, పడుగుకు పరిహారం ఇవ్వాలన్నారు. ఎన్నికల హామీ మేరకు 200 యూనిట్ల కరెంటు, 25వేల నగదు హామీలను అమలు చేయాలన్నారు.