వైద్యారోగ్య శాఖలో సర్వీసు నిబంధనల సవరణ
AP: వైద్యారోగ్య- కుటుంబ సంక్షేమ శాఖలో క్లాస్ సి, కేటగిరీ 2 కింద ఉన్న పోస్టులకు అర్హతలను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. నియామక అర్హతలు, బదిలీలు, పదోన్నతులకు అవసరమైన సర్వీసు నిబంధనల్లో మార్పులు చేసింది. సర్వీసు రూల్స్- 2022కు సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి, బదిలీ ద్వారా నియామకానికి అర్హత పొందాలంటే కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తిచేసి ఉండాలని తెలిపింది.