భారత్ కంటే పాకిస్తాన్‌కే ఎక్కువ నష్టం: మూడీస్

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఏర్పడిన పరిణామాలు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు భారత్ కంటే ఎక్కువ నష్టం కలిగించాయని మూడీస్ ఏజెన్సీ తెలిపింది. పాకిస్తాన్‌కు విదేశీ ఆర్థిక సహకారం పొందడం కష్టతరంగా మారుతోందని వెల్లడించింది. పాక్ అధిక ద్రవ్యోల్బణం, మాంద్యం, 8 శాతం పైగా నిరుద్యోగ రేటును ఎదుర్కొంటుంది. ప్రస్తుతం పాకిస్తాన్‌ను.. దక్షిణాసియాలోనే అత్యంత పేద దేశంగా అభివర్ణించింది.