మంత్రిని కలిసిన ఎమ్మెల్యే జయసూర్య
NDL: మంత్రి అచ్చెన్నాయుడును ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మర్యాదపూర్వకంగా కలిశారు. నందికొట్కూరు నియోజకవర్గంలో తుఫాన్ వల్ల దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం, మొక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించాలని కోరారు. మంత్రి స్పందించి త్వరలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతులకు న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.