VIDEO: పంట నష్టాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్
SRCL: కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో అకాల వర్షంతో నష్టపోయిన పంటలను ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పరిశీలించారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా వడగళ్ల వర్షం కురియడంతో చేతికి వచ్చిన పంట నేలపాలైందని రైతులు ప్రభుత్వ విప్ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో నష్టపోయిన పంటలను రెవెన్యూ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.