అమిత్ షాతో లోకేష్, ఎంపీల భేటీ
BPT: న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ తదితరులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో 'మొంథా' తుఫాను వల్ల జరిగిన నష్టంపై నివేదికను అందజేశారు. తుఫాను ధాటికి అన్ని రంగాలు కలిపి ఏపీలో రూ.6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అమిత్ షాకు వివరించారు. రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్రాన్ని కోరారు.