మహాత్ముని బాటలో పయనించాలి

NTR: జాతిపిత మహాత్మా గాంధీ చూపిన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని గ్రంథాలయాధికారి బీహెచ్ శ్రీనివాసరావు అన్నారు. నూజివీడు పట్టణంలోని ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరం రెండవ రోజు మంగళవారం కొనసాగింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ అహింస, శాంతి, సహనం ప్రపంచానికి జాతిపిత చూపిన గొప్ప ఆయుధాలుగా పేర్కొన్నారు.