నగదు, వెండి ఆభరణాలు అపహరణ
నెల్లూరు జిల్లా (గ్రామీణ) వరికుంటపాడు మండలంలోని తోటలచెరువుపల్లి పెన్నాల ఎల్లమ్మ, నంద్యాల ఎల్లమ్మ ఆలయాల్లో అర్ధరాత్రి దొంగతనం జరిగింది. పెన్నాల ఎల్లమ్మ గుడిలో 4 తాళిబొట్లు, 2 కాసులు, 8 గుండ్లు, 2 వెండి చైన్లు, ఒక కన్ను, హుండీ అపహరించారు. నంద్యాల ఎల్లమ్మ ఆలయంలోనూ హుండీని ఎత్తుకెళ్లారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.