ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ.. కేసు నమోదు

ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ.. కేసు నమోదు

KNR: గంగాధర మండలం వెంకంపల్లి గ్రామంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద అభ్యర్థి సహా ముగ్గురిపై గంగాధర పీఎస్‌లో కేసు నమోదయింది. ఈ నెల 10న ఓటర్లకు డబ్బులు పంచుతున్న గుండవేని నర్సయ్యను ఎఫ్ఎసీ అధికారులు పట్టుకున్నారు. నగదును, ఎలక్ట్రిక్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అభ్యర్థి గుండవేని లావణ్యతో పాటు ఆమె సోదరుడి ఆదేశాల మేరకు ఈ పని చేసినట్లు తెలిపారు.