సమావేశంలో కుప్పకూలిన టీడీపీ నేత
అన్నమయ్య: తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులోని ఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న TDP నియోజకవర్గ సమన్వయకర్త సీడ్ మల్లికార్జున నాయుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. మల్లికార్జునను స్టేజీ పైకి పిలవడంతో మరో వర్గం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన కుప్పకూలిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.