పొట్టి శ్రీరాములు తెలుగు జాతి కోసం పోరాడారు: CM

పొట్టి శ్రీరాములు తెలుగు జాతి కోసం పోరాడారు: CM

AP: తెలుగు జాతి కోసం పొట్టి శ్రీ రాములు పోరాడారని సీఎం చంద్రబాబు అన్నారు. '58 రోజుల పాటు అమరణ నిరాహార దీక్ష చేశారు. ఆయన ఆత్మార్పణతో రాష్ట్రం రగిలిపోయింది. పొట్టి శ్రీరాములు చనిపోయిన రోజునే ఆత్మార్పణ దినోత్సవంగా నిర్వహిస్తున్నాం. అమరావతిలో 58 అడుగుల అమరజీవి విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం. ఆయన ప్రాణత్యాగం చేసిన ప్రాంతాన్ని పరిరక్షిస్తాం' అని పేర్కొన్నారు.