బండ్లపల్లిలో పట్టదారు పాసుపుస్తకాలు పంపిణీ
ATP: నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో జరిగిన గ్రామసభలో బుధవారం రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. గతంలో బండ్లపల్లిలో రీసర్వే కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా 714 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రిసర్వే డీటీ నిరోషా, సర్వేయర్ అనిల్, వీఆరోవో దాదాఫిరా, తదితరులు పాల్గొన్నారు.